భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, మే 2026, సోమవారంభారత్ సమాచార్

మత్తు పదార్థాలపై నిఘా పెంచాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

WhatsApp Image 2026-05-25 at 4.39.26 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాలపై మరింత నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిఘా, నియంత్రణపై సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు ప్రజల సహకారంతో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యానికి, కుటుంబాలకు, సమాజానికి కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మంచి మార్గంలో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో ఎల్లయ్యా, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, మత్తు పదార్థాల నియంత్రణ అధికారి చంద్రకళ, డీఎస్పీలు, పోలీసు, ఎక్సైజ్, విద్య, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.