భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మే 2026, శనివారంభారత్ సమాచార్

పాపన్నపేటలో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WhatsApp Image 2026-05-29 at 8.21.18 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పాపన్నపేట మండల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శనివారం ఘనంగా పంపిణీ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 104 మంది లబ్ధిదారులకు రూ. 1,04,12,064 (ఒక కోటి నాలుగు లక్షల పన్నెండు వేల అరవై నాలుగు రూపాయలు) విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తామని, నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం లభించడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.