భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

అంగన్వాడి బడిబాట కార్యక్రమం

WhatsApp Image 2026-05-30 at 8.39.50 PM

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: వలిగొండ మండల కేంద్రంతో పాటు దాసిరెడ్డి గూడెం గ్రామంలో శనివారం అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు గునుగుంట్ల బాల విజయ, రాపోలు సునీత, సబిత మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ పాఠశాలకు పంపించాలని చిన్నారుల తల్లిదండ్రులను కోరారు. అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ర్యాలీ నిర్వహించారు. అర్హులైన చిన్నారులు అందరిని తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని అంగన్‌వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.