భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు బొల్లు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మురళీకృష్ణ యాదవ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. రైతు బంధు, వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కాలేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు. కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
3, జూన్ 2026, బుధవారంభారత్ సమాచార్