భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ

WhatsApp Image 2026-06-05 at 5.44.06 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని టాయిలెట్లను స్వయంగా పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న రెండు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లలో అవుట్‌ఫ్లో వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపల్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై తక్షణమే స్పందించిన కమిషనర్ రమేష్ కుమార్.. సదరు లోపాలను, మరమ్మతులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలో ప్రజా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.