భారత్ సమాచార్.నెట్, వనపర్తి: చిరు వ్యాపారులను రక్షించడానికి అఖిలపక్ష ఐక్యవేదిక ‘మాల్స్, మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక దుకాణదారులను ప్రోత్సహించాలని, నాసిరకం వస్తువులను విక్రయిస్తున్న మాల్స్‌ను, వ్యాపారస్తులను వ్యతిరేకించాలని ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 14వ తేదీన ధర్మ సమాజ్ పార్టీ అధినేత విషాదరన్ మహారాజ్ సమక్షంలో ఈ ఉద్యమాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ తెలిపారు.
ఈ ఉద్యమానికి ప్రజలు, రాజకీయ, ప్రజా సంఘాలు, కుల, ఉద్యోగ సంఘాలు, కార్మికులు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న జిల్లా అయిన వనపర్తిలో పెద్ద పెద్ద మాల్స్‌కు ఎలా అనుమతులు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో వనపర్తికి పతకాలు