భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

లోక్ అదాలత్‌కు పోటెత్తిన కక్షిదారులు

జిన్నారం కోర్టులో లోక్ అదాలత్.. రద్దీగా మారిన ప్రాంగణం

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం జూనియర్ సివిల్ జడ్జి, మొదటి శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కోర్టుకు హాజరయ్యారు. లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేందుకు వచ్చిన వారితో కోర్టు పరిసరాలు సందడిగా మారాయి.

ఉదయం నుంచే కక్షిదారులు, న్యాయవాదుల రాకతో కోర్టు ప్రాంగణం రద్దీగా కనిపించింది. తమ కేసులకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో పలువురు కక్షిదారులు కోర్టుకు చేరుకున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి సంబంధించి న్యాయవాదులు, కక్షిదారులు తమ వంతు ప్రక్రియలను పూర్తి చేసేందుకు కోర్టులో హాజరయ్యారు.