భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి 15 ఏళ్ల బాలుడి మృతి

నాగారం: ట్రాక్టర్ పై నుండి పడి బాలుడు మృతి

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నాగారం మండలం శాంతినగర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అన్వర్ (15) తండ్రి కమాల్ రాయికొట్టే పనికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అన్వర్ మృతితో శాంతినగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. అన్వర్ మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.