భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

అక్రమ సంబంధం.. కన్న కూతుర్ని హత్యచేసి పాతిపెట్టి

6f2d7adb-19ef-4190-b34f-3f330daad702

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురుని తల్లి చంపిన ఘటనలో పోలీసులు పురోగతిని సాధించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. శివ్వంపేట పీఎస్ పరిధిలోని శభాష్‌పల్లి గ్రామానికి చెందిన కోట్ల రాజు తన కుమార్తె మమతకు ఐదేళ్ల క్రితం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కర్‌తో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె తనుశ్రీ(2 సంవత్సరాలు) సంతానం ఉన్నారు. మమత తన పిల్లలను తీసుకొని అమ్మగారి ఇంటికి వచ్చి తన కొడుకు చరణ్‌ను ఇంటి వద్దే ఉంచి కూతురు తనుశ్రీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మమత ఆచూకీ లభించకపోవడంతో మమత కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

కన్న కూతుర్నే చంపిన కసాయి తల్లి:
దర్యాప్తులో భాగంగా బంటు మమత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కనపర్రు గ్రామంలో ఉందని గుర్తించినట్లు తెలిపారు. టీంలను ఏర్పాటు చేసి అక్కడకు పంపి మమతను, ఆమెతోపాటు ఉన్న షేక్ ఫయాజ్ తీసుకొని వచ్చి విచారించగా ఆమెతోపాటు తీసుకుని వెళ్లిన తనుశ్రీని ఎక్కడని నిలదీశారు. షేక్ ఫయాజ్, బంటు మమతలు కలిసి గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కనపర్రు వెళ్లి అక్కడ వివాహేతర సంబంధంతో ఎలాగైనా తనుశ్రీని చంపాలనుకున్నారు. దీనిలో భాగంగా జూన్ 6వ తేదీన రాత్రి సమయంలో కనపర్రు నుంచి శభాష్ పల్లికి వారి వద్దనున్న గుర్తుతెలియని మోటార్ సైకిల్ పై రాత్రి సమయంలో శభాష్ పల్లి గ్రామశివారులో తనుశ్రీని వారిద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. చిన్నారి డెడ్ బాడీని కాల్వకట్ట వద్ద పాతిపెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ కేసులో ముఖ్యపాత్ర వహించిన శివంపేట పోలీస్ సిబ్బంది మహేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, గట్టేష్, ఐటి కోర్ సిబ్బందిని తూప్రాన్ డిఎస్పి అభినందించారు. నిందితులు షేక్ ఫయాజ్, బంటు మమతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.