భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా  ప్రజాపాలన దినోత్సవం

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీకి నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది సమక్షంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ రామ్ నిరంజన్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.