భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ముత్యాలమ్మ గణపతి వద్ద మహాన్న ప్రసాద వితరణ

ముత్యాలమ్మ గణపతి వద్ద మహాన్న ప్రసాద వితరణ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన గణపతి వద్ద శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

శ్రీ మహాగణపతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీ మహాగణపతి ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పరుపాటి వెంకట్ రెడ్డి, ఎండి అమీర్, కుల్ల రాజాలు, కర్ర మధుసూదన్, కూటికంటి మధు, మాసిరెడ్డి యాకూబ్ రెడ్డి, ముకుంద రెడ్డి, మద్దెల సూరయ్య, ఎస్.కె. అమీర్ పర్యవేక్షించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా వారు విశేష సేవలు అందించారు.