భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

బాటసారులపై కొండముచ్చు వీరంగం

9f1b4424-9cc5-42b0-989e-03063b1cf36f

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ పట్టణంలో శనివారం, ఆదివారం రెండు రోజుల నుంచి కొండముచ్చు వీరంగం సృష్టిస్తుంది. జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్ లో బాటసారులపై దాడి చేసి నలుగురిని గాయపరిచింది. గాంధీనగర్ కు చెందిన ఓ మహిళ, మరో మగ వ్యక్తిపై దాడి చేసింది. రెండు రోజులలో కొండముచ్చు నలుగురిని కరిచింది. క్షతగాత్రులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కొండముచ్చుల బెడదను నివారించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.