భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఈ రాశులకు శుభవార్తలు, మరికొందరికి జాగ్రత్తలు

ఈ రాశులకు శుభవార్తలు, మరికొందరికి జాగ్రత్తలు

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం: ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

వృషభం: వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిధునం: వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలసివస్తాయి.

కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహం: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

తుల: సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి మాటతీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు: వ్యాపార, ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మకరం: గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో మెరుగ్గా రాణిస్తారు.

కుంభం: సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగాల్లో అదనపు పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలను వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.