భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలి

లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్ మాలతి..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండలంలోని చందాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చెన్నగౌని కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మాలతి హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుడు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే రేషన్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

స్మార్ట్ రేషన్ కార్డును ఉపయోగించి సమీపంలోని చౌక ధర దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే బియ్యాన్ని సకాలంలో పొందాలని తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్ మాలతి..

అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. గ్రామస్థులు కూడా తమకు అందుతున్న ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామ సర్పంచ్ చెన్నగౌని కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను గ్రామపంచాయతీ కార్యాలయం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.