భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై పోషణ, ఆరోగ్యం, మహిళలు, చిన్నారుల సంక్షేమంపై పలు సూచనలు చేశారు.
CDPO శిరీష మాట్లాడుతూ.. పోషణ మాసంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లులకు ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు భోజనం చేసి అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మెడికల్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు తప్పకుండా ఇప్పించాలని చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సఖి సెంటర్ శ్రావణి మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సఖి సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలకు అవసరమైన సహాయం, సేవలను అందించేందుకు సఖి సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హబ్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా కుటుంబంలో పిల్లలను సమానంగా పెంచాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఆడపిల్లల శాతం తక్కువగా ఉందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ.. BRB పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరమని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకుంటే జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పారు. పిల్లల సంరక్షణ విషయంలో చట్టపరమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో MPDO పార్థసారథి, CDPO శిరీష, ACDPO కమలాదేవి, సూపర్‌వైజర్ దుర్గ, BRB టీమ్, అబ్బ టీమ్, సఖి టీమ్, హెల్త్ సూపర్‌వైజర్ సుదర్శన్, అంగన్వాడీ టీచర్లు, ANMలు, ఆశాలు, గర్భిణీలు, బాలింతలు, ఆడపిల్లల తల్లులు పాల్గొన్నారు.