భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలి: తక్కెళ్లపల్లి

ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలి: తక్కెళ్లపల్లి

భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని నాయకులకు సూచించారు. ప్రతి డివిజన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన పట్టభద్రులను గుర్తించాలని, వారికి ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు.

ఓటరు నమోదుకు సంబంధించి పట్టభద్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రతి డివిజన్‌కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అర్హత ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని నాయకులు చర్చించారు. అలాగే పట్టభద్రుల సమస్యలు, వారి హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్‌జేసీ కృష్ణతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.