భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్ కాలనీ 26వ వార్డులో CC రోడ్డు నిర్మాణం చేపట్టారు. గురువారం 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాలోతు శ్రీదేవి బాలు నాయక్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. మానుకోట MLA డాక్టర్ మురళి నాయక్ సహకారంతో లాలూ ఇంటి నుంచి దండం వెంకన్న ఇంటి వరకు కొత్త CC రోడ్డు నిర్మాణాన్ని కాంట్రాక్టర్ కొమ్మరాజుల ఆనంద్ చేపట్టారు.
కాలనీలో రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గనున్నాయి. వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి బాలు నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE సౌజన్య, వర్కింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, చుక్క శ్యాం ప్రసాద్, అజ్మీర శ్రీకాంత్, బండి వెంకన్న, దండం వెంకన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు.