భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఝాన్సీలింగాపూర్‌లో CC రోడ్డు నిర్మాణం ప్రారంభం

ఝాన్సీలింగాపూర్‌లో CC రోడ్డు నిర్మాణం ప్రారంభం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో CC రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ మానెగళ్ల రామకృష్ణయ్య గురువారం ఈ పనులను ప్రారంభించారు. BBG రామ్ జీ ద్వారా ఉపాధి నిధులు మంజూరు కావడంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.

గ్రామంలోని ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా CC రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సమత, ఉప సర్పంచ్ మడూరి మహేష్, వార్డు మెంబర్లు టంటం సత్యనారాయణ, శాలిపేట సిద్ధిరాములు, నర్సాగళ్ల నరసమ్మ, సాల్మన్, బానప్ప, దీపిక, నవీన్, నర్సాగళ్ల పౌలు, ఇప్పతేజతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.