భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఇనుగుర్తిలో కాంగ్రెస్ బ్లాక్ డే

ఇనుగుర్తి లో కాంగ్రెస్"బ్లాక్ డే"భారీ నిరసన.. కాంగ్రెస్ అగ్ర నాయకులపై దాడి దారుణం..       కాంగ్రెస్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓటు చోరీపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు పలువురు నాయకులపై బీజేపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ DCC అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో బ్లాక్ డే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు.

రోడ్డుపై బైఠాయించి నిరసన

కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతకుముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రతిపక్ష నాయకులపై దాడులను నిలిపివేయాలని నినాదాలు చేస్తూ ఇనుగుర్తి ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.

భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ్మడపల్లి కుమార్, చెడుపాక సుజాత యాకయ్య, ఇస్లావత్ నరేష్, మీటు నాయక్, భూక్య లక్ష్మీ వెంకన్న, దిశ నెంబర్ గుజ్జునూరి బాబురావు, A.M.C డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ నాయకులు కూరెల్లి సతీష్, ఇస్లావత్ చందు, గంజి రాజేందర్ రెడ్డి, మురళి, కొట్టం మహేందర్ రెడ్డి, రమేష్, నారాయణ, జనార్ధన్, రావుల మల్లేశం గౌడ్, వెంకన్నతో పాటు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.