భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడిగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కేంగర్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి బోయ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. సంఘం బలోపేతానికి, సభ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుతారి శ్రీనివాస్, నర్సింలు, బాపు రాజు తదితరులు పాల్గొన్నారు.