భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నర్సాపూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

నర్సాపూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో సాయిరాం అనే వ్యక్తి మృతి చెందడం పట్ల నర్సాపూర్ MLA వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సాయిరాం కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు.

18 మంది ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ

ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మరో 18 మంది ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

బాధితులు త్వరగా కోలుకునేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, వారికి మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.