భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చండీ అవతారంలో దుర్గమ్మ దర్శనం.. భక్తులకు అన్నదానం

చండీ అవతారంలో దుర్గమ్మ దర్శనం.. భక్తులకు అన్నదానం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలో దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక PACS డైరెక్టర్, BRS గ్రామ శాఖ అధ్యక్షుడు, జై గౌడ్ సంఘం మండల అధ్యక్షుడు తండ నరసయ్య గౌడ్, దుర్గ దంపతులు దుర్గామాత దీక్షదారులకు, ఉత్సవాల నిర్వాహకులకు, పరిసర ప్రాంతాల భక్తులకు బిక్ష వితరణ చేశారు.

చండీ అవతారంలో అమ్మవారి దర్శనం

బుధవారం దుర్గాదేవి చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తండ నరసయ్య గౌడ్, దుర్గ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జగజ్జననికి వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూజా ద్రవ్యాలు సమర్పించి అమ్మవారి సేవలో పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

చండీ అవతారంలో దుర్గమ్మ దర్శనం.. భక్తులకు అన్నదానం

భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక సందడి

సాయంత్రం వేళ అమ్మవారి సన్నిధిలో భక్తులు కీర్తనలు, భజనలు నిర్వహించారు. దుర్గామాత నామస్మరణతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ ప్రతినిధులు ప్రదీప్, అజయ్, శ్రీకాంత్‌తో పాటు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.