భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

PRTU-T S రాష్ట్ర కమిటీలో నెల్లికుదురు నుంచి 11 మంది ఎన్నిక

PRTU-T S రాష్ట్ర కమిటీలో నెల్లికుదురు నుంచి 11 మంది ఎన్నిక

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: PRTU-T S రాష్ట్ర కమిటీలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన 11 మంది ఉపాధ్యాయులకు చోటు లభించింది. రాష్ట్ర కమిటీకి ఎంపికైన వారి వివరాలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి భట్టాపురం మధుసూదన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బాధ్యతలకు ఎంపిక కావడంతో PRTU మండల కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నలుగురు

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నెల్లికుదురు మండలానికి చెందిన నలుగురు ఎంపికయ్యారు. నైనాల MPPS నుంచి భూసాని సోమయ్య, శ్రీరామగిరి UPS నుంచి కొత్త నరసింహా రెడ్డి, బొమ్మరాతి సాయిలు, నెల్లికుదురు ZPHS నుంచి జలగం శ్రీనివాస్ ఈ బాధ్యతలకు ఎంపికయ్యారు.

రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఏడుగురు

PRTU-T S రాష్ట్ర కమిటీలో నెల్లికుదురు నుంచి 11 మంది ఎన్నిక

రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యక్షులుగా నెల్లికుదురు మండలానికి చెందిన మరో ఏడుగురికి అవకాశం లభించింది. మేచరాజుపల్లి ZPHS నుంచి పెరుమాండ్ల రమేష్, చాగంటి స్వామి, నెల్లికుదురు ZPHS నుంచి పెనుకుల రవీందర్, TGMS తుమ్మ నుంచి సతీష్, బ్రాహ్మణ కొత్తపెల్లి UPS నుంచి మామిడాల వెంకటేష్, మునిగలవీడు MPPS నుంచి బోయిని రవీందర్, శ్రీరామగిరి UPS నుంచి గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు.

మండల కమిటీ హర్షం

రాష్ట్ర కమిటీలో నెల్లికుదురు మండలానికి చెందిన 11 మందికి స్థానం దక్కడంపై PRTU మండల అధ్యక్షుడు సొంటి రెడ్డి యుగంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి కమిటీలో మండల ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఎంపికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌కు మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికైన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.