భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్తో కలిసి ఆవిష్కరించారు. గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేసి, గ్రామ ప్రజలను అభినందించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ.. బతుకమ్మ విగ్రహాన్ని చూడగానే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుకొస్తాయని తెలిపారు. విగ్రహాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. శ్రీరామగిరి గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.
బతుకమ్మ పండుగ ప్రకృతిని, స్త్రీశక్తిని, జీవన విధానాన్ని ఆరాధించే గొప్ప పూల పండుగ అని ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణ ప్రజల జీవనశైలిలో, సంస్కృతిలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ పండుగ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
పండుగలను ఆనందంగా జరుపుకోవాలి
సద్దుల బతుకమ్మతో పాటు దసరా పండుగను కూడా ప్రజలంతా ఆనందంగా, ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు బాలకృష్ణ, ఇట్టె లీలా, దేవేందర్ రెడ్డి, హేమలత, శ్రీనివాస్, ఉపసర్పంచ్ రామగిరి సుమన్ పాల్గొన్నారు. నాయకులు బెల్లి నర్సయ్య, డోనికెన మల్లయ్య, మద్దెల సమ్మయ్య గౌడ్, ఆవుల వెంకన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హాజరయ్యారు.
Files, images, and data analysis are unavailable until usage resets tomorrow