భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

యువతకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి: నలమాస కృష్ణ

యువతకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి: నలమాస కృష్ణ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ డా. నలమాస కృష్ణ గౌడ్ అన్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని డా. నలమాస కృష్ణ గౌడ్, డా. డోలి సత్యనారాయణ, మామిడాల సత్యనారాయణ కలిసి ఆవిష్కరించారు. విగ్రహాన్ని డా. నలమాస కృష్ణ గౌడ్ విరాళంగా అందించారు.

యువతకు ఐలమ్మ పోరాటం ఆదర్శం

యువతకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి: నలమాస కృష్ణ

అనంతరం ఐలమ్మ యువజన సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా. నలమాస కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారిగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ జీవితం, పోరాటం నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రజల హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడిన వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.

రాజధాని నడిబొడ్డున ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఆమె పోరాట పటిమకు, కీర్తి ప్రతిష్ఠలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలోని సబ్బండ వర్గాల హక్కుల కోసం త్యాగాలు చేసిన ఘనత ఐలమ్మకు దక్కుతుందని చెప్పారు. అలాంటి మహనీయురాలిని వీరనారిగా స్మరించుకోవడం అందరి అదృష్టమని అన్నారు.

ఘనంగా విగ్రహావిష్కరణ.. అన్నదానం

యువతకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి: నలమాస కృష్ణ

శ్రీరామగిరి గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె పోరాట చరిత్రను, ధైర్యసాహసాలను భావితరాలకు తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదారి ప్రశాంత్, సంఘం ప్రధాన కార్యదర్శి మడిపెద్ది ముఖేష్, ప్రముఖ గాయకుడు ప్రసాద్, వైద్యులు, ప్రొఫెసర్లు డా. మడిపెద్ది వెంకన్న, డా. కూరపాటి రమేష్, మాజీ సర్పంచ్ డా. ఆదూరి కళాధర్ రాజు, దార్ల శివరాజ్, పోరండ్ల సోమయ్య, లక్ష్మయ్య, రాములు, నిమ్మల బిక్షం, పైండ్ల శ్రీనివాస్, పోరండ్ల రవితేజ, సతీష్, హరీష్, మడిపెద్ది బిక్షం, పోరండ్ల శ్రీనివాస్, శ్రీకాంత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సిరి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు ఎదునూరి శ్రీనివాస్, వాసం ఆనంద్, కె. నాగయ్య, ఐలయ్య, డోనికెన శ్రీనివాస్, బెల్లి నరసయ్య, తూటి వెంకటరెడ్డి, ఇసంపల్లి సైదులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విగ్రహ దాత డా. నలమాస కృష్ణ గౌడ్‌ను చాకలి ఐలమ్మ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.