భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఈటల రాజేందర్

చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఈటల రాజేందర్

భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: కీసర మండలం చీరాల పరిధిలోని జన్నారం కాలనీ ఇందిరమ్మ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్‌ను మల్కాజిగిరి MP ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీ సమస్యలపై ఆరా

చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఈటల రాజేందర్

పార్క్ ప్రారంభించిన అనంతరం ఈటల రాజేందర్ కాలనీలోని పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా వీధి దీపాలు, తాగునీటి సరఫరా, రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన సమస్యల గురించి కాలనీవాసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కాలనీలో పిల్లలకు ఆటవిడుపు, స్థానికులకు వ్యాయామ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఈ పార్క్, ఓపెన్ జిమ్ ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీవాసులు, స్థానికులు పాల్గొన్నారు.