భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

తిరుమలగిరి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా కేశిడి వెంకటలక్ష్మా రెడ్డి

తిరుమలగిరి పట్టణ శాఖ(టౌన్) అధ్యక్షులుగా కేసిడి వెంకటలక్ష్మా రెడ్డి

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కేశిడి వెంకటలక్ష్మా రెడ్డిని నియమించినట్లు MLA మందుల సామేల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా MLA మందుల సామేల్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కేశిడి వెంకటలక్ష్మా రెడ్డి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి జనార్దన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మిలాలు, TPCC SC విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందుల సూర్య కిరణ్, రేగటి రవి, భాస్కర్, చింతకాయల సుధాకర్, చెన్నబోయిన మధు, సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.