భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సీజీఆర్ మాట్లాడుతూ.. దుర్గమ్మ కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వేణు రెడ్డి, భరత్ గౌడ్, వెంకట్ రెడ్డి, అనిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బుక్క భాస్కర్, శివ, జీవన్ రెడ్డి, నీలం విక్రమ్, రాహుల్ రెడ్డి, శివారెడ్డి, బుక్క సాయి, మనీ, సుమన్, మనీ చెందన్ తదితరులు, వేడుకల నిర్వాహకులు పాల్గొన్నారు.