భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విజయదశమి పండుగను పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. దుర్గామాత చల్లని చూపులు, ఆశీస్సులు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో శుభాలను తీసుకురావాలని బుచ్చేష్ యాదవ్ ఆకాంక్షించారు.