భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో వ్యక్తి అరెస్ట్.. కోర్టు ఆదేశాలతో రిమాండ్

ఇనుగుర్తిలో వ్యక్తి అరెస్ట్.. కోర్టు ఆదేశాలతో రిమాండ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఇనుగుర్తి SI పి.నరేష్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా, చట్టాన్ని ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన గుజ్జునూరి వినోద్ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు SI పి.నరేష్ తెలిపారు.

అరెస్ట్ అనంతరం వినోద్‌ను మహబూబాబాద్ కోర్టులో హాజరుపరిచామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని SI పి.నరేష్ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.