భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీసు విధుల్లో సమర్థత సాధించాలంటే శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన ఎంతో అవసరమని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరై పరేడ్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

ఈ సందర్భంగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, సమయపాలనతో పాటు విధుల పట్ల అంకితభావం కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని తెలిపారు.

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలతో పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించినప్పుడు స్పందించి, వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని తెలిపారు.

ఫిట్‌నెస్‌తోనే సమర్థవంతమైన పోలీసింగ్‌: డీఎస్పీ ప్రసన్న కుమార్

విధుల నిర్వహణలో పరస్పర సమన్వయం, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఆర్‌ఐ శైలంధర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.