భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

లక్ష్మి కుటుంబానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన నెరల్లా లక్ష్మి అకాల మరణం పట్ల BRS నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు తిరుపతిరెడ్డి తన వంతు సహాయంగా ఆర్థిక సాయాన్ని అందించారు. గ్రామ BRS నాయకుల ద్వారా ఈ సహాయాన్ని లక్ష్మి కుటుంబ సభ్యులకు చేరవేశారు.

ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించి ఆయన ఆర్థిక సాయం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.