భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని PM శ్రీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
తెలంగాణ మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బాధ్యులు తెలిపారు. మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. సతీశ్, ఎండీ నూరుద్దీన్, పి. యుగంధర్, ఎల్. యుగంధర్, సీహెచ్. జ్యోతి, బి. కవిత, పి. కరుణశ్రీ, వై. నాగమోహన్ రావు, బి. దేవేందర్, ఎన్. చంద్రు నాయక్, జి. కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.