భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

NEET-SS 2026 దరఖాస్తులు ప్రారంభం.

NEET-SS 2026 దరఖాస్తులు ప్రారంభం.

భార‌త్ స‌మాచార్, విద్య : సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) కీలక ప్రకటన చేసింది. NEET-SS 2026 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 29న ప్రారంభమైంది. అర్హత ఉన్న వైద్యులు నవంబర్ 18, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోని నిబంధనలు, అర్హతలు, పరీక్ష వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

NEET-SS ద్వారా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (DM), మాస్టర్ ఆఫ్ చిరుర్జీ (MCh), డాక్టర్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DrNB) వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా సంబంధిత గ్రూపును ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా NBEMS వెబ్‌సైట్‌లోని NEET-SS 2026 లింక్‌ను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం లాగిన్ వివరాలతో అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యార్హత, మెడికల్ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. సూచించిన ఫార్మాట్‌లో ఫొటో, సంతకం తదితర పత్రాలను అప్‌లోడ్ చేసి, పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రశ్నపత్ర గ్రూపునకు దరఖాస్తు ఫీజు రూ.3,500గా నిర్ణయించారు. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, ఫారమ్‌ను సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని భద్రపరుచుకోవాలి.

పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డిసెంబర్ 7న విడుదల చేయనుండగా, డిసెంబర్ 11, 12 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను జనవరి 12, 2027 నాటికి ప్రకటించనున్నారు. పరీక్షలో సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయించగా, తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నకు మార్కుల కోత ఉండదు. దరఖాస్తు గడువు ముగిసేలోపు అభ్యర్థులు ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హతలు, పరీక్ష విధానం, ఫీజు చెల్లింపు నిబంధనలు, ఇతర మార్గదర్శకాల కోసం NBEMS అధికారిక వెబ్‌సైట్ పరిశీలించాలి.