భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నర్సాపూర్‌కు తెలంగాణ హైకోర్టు జడ్జి.. ఘన స్వాగతం

మెదక్ జిల్లా నర్సాపూర్ కి చేరుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి
మెదక్ జిల్లా నర్సాపూర్ కి చేరుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గడి ప్రవీణ్ కుమార్ మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా జడ్జి నీలిమ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నర్సాపూర్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆయన సందర్శించి పరిశీలించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ కి చేరుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి

ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, SP డి.వి. శ్రీనివాసరావు, DFO జోజి, బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం పలికారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ కి చేరుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి

అనంతరం గడి ప్రవీణ్ కుమార్ నర్సాపూర్‌లోని సాగర్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి నర్సాపూర్ పర్యటన సందర్భంగా న్యాయశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.