భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

రామాయంపేటలో ఇందిరా గాంధీ వర్ధంతి.. ఘన నివాళులు

ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఘన నివాళులు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గూగుల్ రవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి, విప్లవ్, బాబు, శంకర్, భాస్కర్, స్వామి, సత్యం, నరేష్, యాదగిరి, రమేష్, పోచయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Indira Gandhiకి ఘన నివాళులర్పించారు.