భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: మెదక్ ఎస్పీ

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ప్రతి సమస్యపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా విచారణ పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు.

ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.