భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి: కలెక్టర్

ప్రచురణార్థం  మెదక్ 04 నవంబర్ 2026   ఏల్ నీనో ఎఫెక్ట్  నేపథ్యంలో తాగునీటికి ముందస్తు కార్యాచరణ కలెక్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించి ప్రజలకు నిరంతర తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడంతో పాటు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ నేపథ్యంలో బుధవారం హవేలీ ఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలోని చెక్‌డ్యామ్‌ను కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం, తహసీల్దార్ సింధు రేణుక, గ్రామ సర్పంచ్ వినోద, ఎలక్ట్రిసిటీ DE రామేశ్వర స్వామి, మిషన్ భగీరథ EE సంపత్ కుమార్, ఇంట్రా DE నరేష్, గ్రామస్తులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ గ్రిడ్ సిబ్బంది ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం రూపొందించిన మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. డిసెంబర్ తర్వాత సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాకు ₹.42 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు.

ప్రచురణార్థం  మెదక్ 04 నవంబర్ 2026   ఏల్ నీనో ఎఫెక్ట్  నేపథ్యంలో తాగునీటికి ముందస్తు కార్యాచరణ కలెక్

సర్దన చెక్‌డ్యామ్ వద్ద ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సుమారు 3.5 కిలోమీటర్ల మేర జక్కన్నపేట గ్రామం వరకు పైప్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా మొత్తం 33 గ్రామాలకు ప్రతిరోజూ ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.

సర్దన చెక్‌డ్యామ్‌తో పాటు పొడ్చాన్‌పల్లి, కొత్తపల్లి, మిన్‌పూర్ చెక్‌డ్యామ్‌ల వద్ద కూడా గ్రిడ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

నీటి నిల్వలు, అందుబాటులో ఉన్న వనరుల పరిస్థితిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విద్యుత్ వినియోగంలోనూ పొదుపు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.