భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాల్యవివాహాలు చట్టవిరుద్ధం.. ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు

బాల్యవివాహాలు చట్ట విరుద్ధం:సర్పంచి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, ఎవరూ వీటిని ప్రోత్సహించకూడదని సౌల్లతండా సర్పంచి గుగులోతు సుజాత వాసు తెలిపారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బాలికల భద్రత, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌల్లతండా అంగన్వాడీ కేంద్రంలో బుధవారం VCPCC కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచి గుగులోతు సుజాత వాసుతో పాటు ICDS సూపర్వైజర్ జలగం సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కిశోర బాలికల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు.

బాల్యవివాహాలు చట్ట విరుద్ధం:సర్పంచి

ఎక్కడైనా బాలికలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య పరిరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బాలింతలు, తల్లులు, గర్భిణీలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.