భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వయం ప్రతిభతో రాజకీయాల్లో ఎదిగినా నిరాడంబరంగా, ఒదిగి ఉండే సంస్కార గుణం కలిగిన గొప్ప నాయకుడు ఎదళ్ల యాదవ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
మండల కేంద్రం నెల్లికుదురులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. యాదవ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. యాదవ రెడ్డి నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
యాదవ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యాదవ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవ కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.