భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మరో ముందడుగు పడింది. నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని జానకంపేట తండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యాలయంలోని విద్యార్థినులకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు శుభ్రమైన తాగునీటి సౌకర్యం కలగనుంది.
ఈ కార్యక్రమంలో BJP మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ నాయకులు సురేష్, ఆంజనేయులు గౌడ్, రాములు నాయక్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నాగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ హాజరయ్యారు.
అలాగే పార్టీ సీనియర్ నాయకులు, BJYM అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, BJYM నాయకులు, యువ నాయకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RO వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో కేజీబీవీ విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు లభించనుంది.