భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

కుక్క దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

వృద్ధురాలిపై కుక్క దాడి: ఆసుపత్రికి తరలింపు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కొమ్మనబోయిన యాకమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

ఉదయం సమయంలో వృద్ధురాలిపై కుక్క దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యాకమ్మను హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడ మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం అవసరమని భావించి తదుపరి చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి సిఫారసు చేశారు.