భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ప్రధాని మోదీని మురిపించిన చిన్నారి భజన్..

ప్రధాని మోదీని మురిపించిన చిన్నారి భజన్..

భార‌త్ స‌మాచార్, జాతీయం : దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ చిన్నారి తన మధురమైన భజన్‌తో ప్రత్యేక ఆనందాన్ని పంచింది. ఆ చిన్నారి పాటను ఆసక్తిగా విన్న ప్రధాని చిరునవ్వుతో అభినందించారు. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో మోదీ జరిపిన సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి పాటకు ప్రధాని స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నవంబర్ 6న న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొంతసేపు సరదాగా గడిపిన మోదీ.. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలో కుటుంబంతో వచ్చిన ఓ చిన్నారి ప్రధాని ముందు భజన్ ఆలపించింది. ఆమె పాటను శ్రద్ధగా విన్న మోదీ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఈ మధురమైన క్షణాలను ప్రధాని కార్యాలయం కూడా ప్రత్యేకంగా వెల్లడించింది.

ఈ భేటీకి సంబంధించిన వీడియోను మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. దీపావళి వాతావరణంలో రాముడు, సరయూ రాకతో పండుగ మరింత పవిత్రంగా, దివ్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. సూర్యకుమార్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వీడియోలో చిన్నారి భజన్‌తో పాటు ప్రధాని కుటుంబ సభ్యులతో ముచ్చటించిన దృశ్యాలు కూడా కనిపించాయి.

ఇక ఈ సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ 2026 టీ20 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా అందుకున్న బంగారు పతకాన్ని కూడా మోదీ పరిశీలించారు. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత జట్టు సాధించిన విజయం గురించి ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. ఇటీవల బ్యాటింగ్ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన సూర్య.. తిరిగి జాతీయ జట్టులోకి రావడానికి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తున్నారు. మొత్తంగా క్రికెట్, కుటుంబ అనుబంధం, దీపావళి సందడి కలిసిన ఈ ప్రత్యేక భేటీ అభిమానులను ఆకట్టుకుంటోంది.