భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అదనపు కోర్టు ప్రారంభమైన సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్‌కు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాదులు, నర్సాపూర్ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ గౌడ్, అడ్వకేట్ ఆకుల శ్రీనివాస్, అవ్వ ఆనంద్, నాగరాజు, సాయిరామ్ తదితరులు బుచ్చేష్ యాదవ్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కోర్టు ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.