భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: అక్కన్నపేట మండల డీజే సౌండ్, లైటింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా నూనె కుమార్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా భూక్య సంతోష్ నాయక్, కోశాధికారిగా బండి రాజశేఖర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు యూనియన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
యూనియన్‌లో ఐక్యతను కాపాడుతూ సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సభ్యులు సూచించారు. డీజే సౌండ్, లైటింగ్ రంగంలో పనిచేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నూతన కార్యవర్గం చొరవ చూపాలని కోరారు. సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని పనిచేస్తూ యూనియన్ ఐక్యతకు, సభ్యుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.