భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రోహిత్ రావు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు,86మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ.ఎమ్మెల్యే రోహిత్ రావు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. పేదలు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు,86మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ.ఎమ్మెల్యే రోహిత్ రావు

మంగళవారం నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్లతో పాటు కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

87 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు,86మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ.ఎమ్మెల్యే రోహిత్ రావు

నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 21 మంది దివ్యాంగులు, ఆరుగురు ఒంటరి మహిళలు, 14 మంది గీత కార్మికులు, 46 మంది వితంతువులు ఉన్నారని వివరించారు. ఈ పెన్షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా సుమారు ₹.2.15 లక్షల ఆర్థిక సహాయం అందనుందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు,86మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ.ఎమ్మెల్యే రోహిత్ రావు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మూడేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోందని తెలిపారు. ఈ కాలంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు వంటి పలు పథకాలను అమలు చేసినట్లు చెప్పారు.

ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన పేదలెవరూ దూరం కాకుండా వారికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు,86మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ.ఎమ్మెల్యే రోహిత్ రావు

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ బాయి, MPDO తిరుపతి రెడ్డి, IKP APM సృజన్ కుమార్ రెడ్డి, సర్పంచులు పార్స్ సంతోష్, సంతోష్ గోండా స్వామి, మహేందర్ సింగ్, కాబోజీ నర్సింలు, ఉపసర్పంచులు మహేష్, రాములు, విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ తాళ్ల కృష్ణగౌడ్, శేరిపల్లి గ్రామ అధ్యక్షుడు మోతీలాల్ పాల్గొన్నారు.

వీరితో పాటు నాయకులు గోవర్ధన్, లక్ష్మీనర్సింలు, బాచి స్వామి, నర్సింలు గౌడ్, చిన్న కృష్ణగౌడ్, ఆటో జానీ, చందు యాదవ్, రాజాసింగ్, కందరి బాబు, భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.