భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: అయ్యప్ప మాలధారణతో విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఓ ఉద్యోగిని కార్యాలయంలోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఆదిబట్లలో చర్చనీయాంశంగా మారాయి. ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని TCS కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
అయ్యప్ప స్వామి మాల ధరించి, దీక్ష నియమాలను పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉద్యోగికి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురైనట్లు ఆరోపణలు తీవ్ర కలకం రేపాయి. ముఖ్యంగా TCSలో సైట్ లీడ్‌గా పనిచేస్తున్నాడని చెబుతున్న సికిందర్ అనే వ్యక్తి సదరు ఉద్యోగిని లోపలికి అనుమతించే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాలధారణతో విధులకు హాజరవడం తప్పేనా?
అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా భక్తులు మాలధారణ చేసి, నిర్దిష్ట నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మాల ధరించిన వ్యక్తి విధులకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఎదురైనట్లు చెబుతున్న పరిస్థితులు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఉద్యోగుల వ్యక్తిగత విశ్వాసాలు, కార్యాలయ నిబంధనల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.