భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో బీసీ జనగర్జన

మెదక్ జిల్లా రామాయణపేటలో మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశవ్యాప్తంగా బీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ జనగర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ బీసీ సంక్షేమ సంఘం–రాష్ట్రీయ బీసీ మహాసంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేటలో బీసీ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి జనగర్జన కార్యక్రమం వివరాలను వెల్లడించారు.

మెదక్ జిల్లా రామాయణపేటలో మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు

బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీల జనాభాను గుర్తించేలా సమగ్ర కులగణన చేపట్టాలని, Bీసీ, SC, ST రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా రామాయణపేటలో మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు

ఈ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో నిర్వహించనున్న జనగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని కోరారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, అవకాశాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మెదక్ జిల్లా రామాయణపేటలో మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు

సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు సమాన అవకాశాలు లభించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈ జనగర్జన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సంఘం ప్రచార పోస్టర్‌లో పేర్కొంది. బీసీల హక్కులు, ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల అంశాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

మెదక్ జిల్లా రామాయణపేటలో మీడియా సమావేశం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు

ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు మెట్టు గంగారం, జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు మల్లికార్జున గౌడ్, యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పోచంల గణేష్, జిల్లా బీసీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆకుల సుజాత మల్లేష్ గౌడ్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు అనిల్ కుమార్, పట్టణ అధ్యక్షులు పచ్చంటి రాము, బీసీ మహిళా నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.