భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఇందిరమ్మ బీమా క్యాంపులను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్

ఇందిరమ్మ బీమా క్యాంపులను స్పెషలాఫీసర్ విసిట్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇనుగుర్తి మండలంలో శుక్రవారం ప్రారంభమైంది. మండలంలోని చిన్ననాగారం, ఇనుగుర్తి, కోమటిపల్లి గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్యాంపులను మండల స్పెషల్ ఆఫీసర్, DRDA అడిషనల్ PD మల్లేశ్వరి సందర్శించి దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హుల వివరాల నమోదు, దరఖాస్తుల స్వీకరణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ బీమా క్యాంపులను స్పెషలాఫీసర్ విసిట్

కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ బీమా: మల్లేశ్వరి

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన వారు, 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఇందిరమ్మ బీమా క్యాంపులను స్పెషలాఫీసర్ విసిట్

అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఇందిరమ్మ బీమా క్యాంపులను స్పెషలాఫీసర్ విసిట్

అనంతరం ఎంపీడీవో తోట హరీష్ కూడా దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులను సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చెడుపాక సుజాత యాకయ్య, తమ్మడపల్లి కుమార్, మద్దెల బిక్షపతి గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పిట్టల శేఖర్, రమణమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సత్యనారాయణ, GPOలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.