భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో భారీగా CMRF చెక్కుల పంపిణీ

పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిది 87 లక్షల చెక్కుల పంపిణీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. వైద్య చికిత్స కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయికృష్ణ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 262 మంది లబ్ధిదారులకు మొత్తం ₹87 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు పెద్ద భారంగా మారుతున్నాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించడం వల్ల కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని తెలిపారు.

నర్సాపూర్ నియోజకవర్గంలో ₹8.21 కోట్లకు పైగా సాయం

2024 నుంచి 2026 వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మొత్తం 2,113 మంది లబ్ధిదారులకు ₹8.21 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు. అలాగే LOC ద్వారా మరో 160 మందికి ₹7 కోట్ల సహాయం అందించినట్లు వివరించారు. వైద్య అవసరాలతో ఇబ్బందులు పడుతున్న అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిది 87 లక్షల చెక్కుల పంపిణీ

సంక్షేమ సాయంలో పారదర్శకతకు ప్రాధాన్యత

ప్రజలకు అందాల్సిన సంక్షేమ సహాయంలో ఎలాంటి అవినీతికి తావులేదని ఆవుల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల్లో అవినీతికి పాల్పడటం నేరమే కాకుండా పాపమని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. వైద్య ఖర్చుల కారణంగా ఏ పేద కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, CMRF లబ్ధిదారులు పాల్గొన్నారు.